ఆధునిక కంటి, దంత వైద్య సేవలతో కార్నిల్ డెంట్ ఆసుపత్రి ప్రారంభం

కార్పొరేటర్ ప్రభుదాస్

ఆధునిక కంటి, దంత వైద్య సేవలతో కార్నిల్ డెంట్ ఆసుపత్రి ప్రారంభం

కాప్రా, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ ఫేజ్-2 కమాన్ ఎదురుగా కార్నిల్ డెంట్ (అశోక ఎంపైర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్) కళ్ళు మరియు దంతాల ఆసుపత్రి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ శనివారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ —
“మీర్పేట్ హెచ్ బి కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ప్రధాన పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. కంటి మరియు దంత సంబంధిత వ్యాధులకు సమగ్ర వైద్యం అందించే ఈ ఆసుపత్రి, ప్రజలకు ఆర్థిక పరంగా కూడా సౌకర్యవంతంగా ఉంటుంది” అని తెలిపారు.అశోక ఎంపైర్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆధునిక యంత్రాలు, నిపుణులైన వైద్యుల బృందంతో ఈ సెంటర్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందించనున్నామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉల్లెం బాలరాజు, శేఖర్ గౌడ్, దండెం నరేందర్, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు, కాలనీ నివాసితులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపులో స్వీట్లు పంపిణీ చేసి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .