పాఠశాలలో మహాత్మ జ్యోతిబా పూలే-సావిత్రిబాయి పూలే  విగ్రహాలు ఏర్పాటు చేయాలి

బీసీ సంక్షేప సంఘం ఉమ్మడి  జిల్లా  అధ్యక్షులు క్రిష్ణ మనోహర్ గౌడ్ గౌడ్ 

పాఠశాలలో మహాత్మ జ్యోతిబా పూలే-సావిత్రిబాయి పూలే  విగ్రహాలు ఏర్పాటు చేయాలి

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
 ప్రభుత్వ  ప్రైవేటు పాఠశాలలో సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని  బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణ మనోహర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణా చౌరస్తా లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు క్రిష్ణ మనోహర్ గౌడ్  ఆధ్వర్యంలో  భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 194 వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.  అనంతరం  క్రిష్ణ మనోహర్ గౌడ్  మాట్లాడుతూ.. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానిస్తుందనీ హర్ష వ్యక్తం చేశారు.భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, సమాజం కోసం  ఎన్నో రకాల ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మహిళలలో చైతన్యం కలిగించి ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన సంఘసంస్కర్త భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ,వారిని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని వారి జీవిత చరిత్ర, తెలుసుకోవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు, సావిత్రిబాయి ఫూలే. అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందనీ. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడి, కుల వ్యవస్థ పునాదులను పెకలించి, మహిళల సకల హక్కుల కోసం పోరాడటం సామాజిక బాధ్యతగా స్వీకరించిన ధీశాలి అని క్రిష్ణ మనోహర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రంలో బిసి సంఘాల  నాయకులు, విద్యార్థి జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .