చర్లపల్లి డివిజన్‌లో వరద సమస్యల పరిష్కారానికి చర్యలు
హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి కి బొంతు శ్రీదేవి యాదవ్ ధన్యవాదాలు
చర్లపల్లి, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో వరద నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం (2.0760) కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు హెచ్ఎండబ్ల్యూ
ఎస్ ఎండి అశోక్ రెడ్డి కి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.లక్ష్మీ నగర్, బి.యన్.రెడ్డి నగర్, చక్రిపురం, నేతాజీ నగర్, సోనియా గాంధీ నగర్, విద్య మారుతి కాలనీ, భరత్ నగర్, కుషాయిగూడ, నాగార్జున కాలనీ, హనుమాన్ కాలనీ, వెంకట్ రెడ్డి నగర్, చర్లపల్లి వంటి కాలనీలలో వెంటనే పనులు ప్రారంభించాలని ఎండి అశోక్ రెడ్డి జిఎం సంతోష్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఇటీవలి భారీ వర్షాల వల్ల చర్లపల్లి పరిధిలోని మీనాక్షి నగర్, శుభోదయం నగర్, ఫుకత్ నగర్, కుషాయిగూడ, లక్ష్మీనరసింహ కాలనీ, కృష్ణ రెడ్డి నగర్, డాక్టర్స్ కాలనీ, లోకమాత కాలనీ వంటి ప్రాంతాలు తీవ్ర ముంపుకు గురైన విషయాన్ని శ్రీదేవి యాదవ్ వివరించారు.దీనిపై స్పందించిన ఎండి అశోక్ రెడ్డి, ఈ కాలనీలకు కూడా ఇప్పటికే శాంక్షన్ చేసిన ప్రాజెక్టుల తో పాటు తక్షణమే పనులు ప్రారంభించాలని జిఎం సంతోష్ కు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.వర్షాల కారణంగా పనులు ఆలస్యమవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులు కోరారు.అదనంగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద శ్రీకృష్ణారెడ్డి నగర్ యుజిడీ పనుల కోసం రూ.25 లక్షలు మంజూరు చేయించడంలో ఆమె ప్రత్యేక పాత్ర వహించారు.


Comments