నాలాపై ఎవరైనా ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు.

మండల సర్వేయర్ సుజాత,ఏడీ శ్రీనివాసులు.

నాలాపై ఎవరైనా ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు.

 హాసన్ పర్తి,నవంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ భీమారం గ్రామంలోని శ్యామల చెరువు నాలా పాయింట్లను అధికారులు రెండోసారి గుర్తించారు. మండల సర్వేయర్,ఏడి సర్వేయర్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సర్వేలో భీమారం శివారు నుండి లష్కర్ సింగారం శివారు గల సున్నమ్ కుంట వరకు చెరువుకు సంబంధించిన హద్దులను గుర్తించి గుర్తులు ఏర్పాటు చేశారు.ఇప్పటికే అక్టోబర్ 27న గ్రామస్తుల విజ్ఞప్తిపై అధికారులు చెరువును సందర్శించి మొదటిసారి నాలా పాయింట్లను గుర్తించిన విషయం తెలిసిందే ఆ సర్వే అనంతరం మరింత స్పష్టత కోసం  రెండోసారి సర్వే చేపట్టారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నాలాపై ఎవరైనా ఆక్రమణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరంగా ఎటువంటి రాయితీ ఇవ్వ బొమని నాలాపై నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.చెరువుకు సంబంధించిన నాలా పూర్తి హద్దులు,పాయింట్లు ఖరారైన తర్వాత శాశ్వత రికార్డులు సిద్ధం చేస్తామని ఏడి సర్వేయర్,మండల సర్వేయర్ తెలిపారు.భీమారం శ్యామల చెరువు నీటి మత్తడి (నీరు పోయే నాలా) సరిహద్దులు రెండోసారి సర్వే చేసి నిర్ధారించామని త్వరలో సర్వే పూర్తి అవుతుందని తెలిపారు.గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు అధికారుల చర్యను స్వాగతించారు. చెరువును ఆక్రమణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చెరువు పునరుద్ధరణ జరిగితే గ్రామానికి మళ్లీ పచ్చదనం వస్తుందని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆకుల కుమార్,అటికం రవీందర్ గౌడ్,చింతల లక్ష్మణ్,ఉప్పు ప్రభాకర్,కోటగిరి రాధాకిషన్,ఆకుల సదానందం,గుంజ సాయి,నాతి సమ్మయ్య,నాయకపు శ్రీనివాస్,పప్పు రమేష్,నాతి రమేష్,వల్లాల శ్రీధర్,ఉప్పు శివ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .