ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు..
రాష్ట్ర,జిల్లా సరిహద్దుల్లో 15 చెక్ పోస్టుల ఏర్పాటు... నిరంతర పర్యవేక్షణ
......పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 20, తెలంగాణ ముచ్చట్లు;
ఆంధ్రప్రదేశ్ నుండి ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నిబంధనలు విరుద్ధంగా జరిగే ఇసుక రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ద్వారా పోలీస్, మైనింగ్, తదితర శాఖల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని అధికారులకు ఆదేశించారు. చెక్ పోస్టులలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఆంధ్ర నుంచి ఇసుక రవాణా చేసిన వాహనాలపై కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక పోలీసుల పెట్రోలింగ్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారుల నిరంతరం నిఘాతో పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సూచించారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 15 చెక్ పోస్టులలో సిబ్బంది 3 షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని పోలీస్ కమిషనర్ వివరించారు.


Comments