కుంగ్ ఫూ లో రాణిస్తున్న విద్యార్థులు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ఇంటర్నేషనల్ హూయన్ చంగ్ ష్ ఇండియా ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లోని చరణ్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన 4వ నేషనల్ లెవల్ ఓపెన్ కుంగ్ ఫు అండ్ కరాటే ఛాంపియన్ షిప్ టోర్నమెంట్‌లో మండలంలోని తాటికాయల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు.
ఈ టోర్నమెంట్‌లో మొదటి బహుమతి టీ.అర్చన, రెండవ బహుమతి టీ.అమిత, మూడవ బహుమతి ఏషియా పౌల్, నాలుగవ బహుమతి ఐశ్వర్య, ఐదవ బహుమతి టీ.చందన స్పారింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు.
ఈ విజయాల గురించి కుంగ్ ఫు మాస్టర్ ఎర్ర. రమేష్ మాట్లాడుతూ, తన గ్రాండ్ మాస్టర్, ఫిల్మ్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ బి.వెంకట బాబు సహకారంతో రెడ్ స్టార్ట్ కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కుంగ్ ఫు, కరాటే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన విజయాలను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల బృందం,
గ్రామస్థులు అభినందిస్తూ, విద్యార్థులు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాస్టర్ ఎర్ర. రమేష్ సేవలను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.


Comments