విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఎమ్మెల్యే మేఘారెడ్డి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

వనపర్తి,అక్టోబర్15(తెలంగాణ ముచ్చట్లు):

అండర్–14, అండర్–17 బాలబాలికల ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్ వంటి క్రీడా పోటీలను బుధవారం వనపర్తిలో ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే అనంతరం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, “15 మండలాల నుండి పాల్గొనే విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని విజేతలుగా నిలవాలి. గెలుపు-ఓటములు ఆటలో సహజం; ఓడినవారు ధైర్యం కోల్పోకుండా మరింత కృషితో ముందుకు సాగాలి” అని సూచించారు.తదుపరి మాట్లాడుతూ, “మన రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ఈ గ్రౌండులోనే తన విద్యార్థి దశలో ఆటలలో పాల్గొన్నారు. ఈ క్రీడా ప్రాంగణాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు 50 కోట్లు మంజూరు చేశారు. అదనంగా, 15 కోట్లతో జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు” అని తెలిపారు.శ్రీనివాసపురం శివారు 55వ సర్వే నంబర్లలో క్రీడా పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మద్దతుతో అనుమతి లభించిందని చెప్పారు. వనపర్తిలో క్రికెట్ మైదానానికి కూడా అనుమతులు మంజూరైనట్లు వెల్లడించారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా దృష్టి సారిస్తే దేశ, విదేశాల్లో వనపర్తి పేరు ప్రతిష్టలను చాటగలరని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం వసతి గృహాల్లో కాస్మోటిక్ ఛార్జీలను పెంచి, నాణ్యమైన ఆహారం అందించేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.అంతేకాకుండా, విద్యార్థులు మొబైల్ ఫోన్ మత్తుకు లోనవకుండా తమ లక్ష్యాల సాధనలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, విద్యాశాఖ అధికారులు, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .