సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్‌పై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్‌పై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు.

సత్తుపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలో స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు కోలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు సేలం సత్యనారాయణరెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై దాడి ప్రయత్నం చేయడం భారత రాజ్యాంగ న్యాయవ్యవస్థపైనే దాడి చేసినట్టేనని అన్నారు.


WhatsApp Image 2025-10-07 at 7.37.20 PMసనాతన ధర్మం పేరుతో సమాజంలో అరాచకాలు సృష్టించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై షూ విసరడానికి ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. భారత న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు సర్వేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రావుల రాజబాబు, రాము, అర్జున్, సిఐటియు నాయకులు మల్లూరి చంద్రశేఖర్, శరత్, మహిళా సంఘం ప్రతినిధులు సుశీల, రత్నం, పద్మ, మరియమ్మ, సుజాత, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .