అయ్యప్ప కాలనీలో తాజ్ హాలు డే బ్రేక్ ఫాస్ట్ హోటల్ ప్రారంభం
దమ్మాయిగూడ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన తాజ్ హాలు డే బ్రేక్ ఫాస్ట్ హోటల్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించే దిశగా కొత్త రెస్టారెంట్లు రావడం ఆనందకరమని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, వసుపతి రమేష్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ నాగేందర్, నరేందర్ రెడ్డి, గాలి సంపత్ యాదవ్, డొంకెన రవీందర్ గౌడ్, తోట నరేష్ పటేల్, రామకృష్ణ తదితర నాయకులు పాల్గొని హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులు భారీగా తరలివచ్చి ఆనందం వ్యక్తం చేశారు.


Comments