జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు‌: 

కోర్టులో పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన డిసెంబర్‌ 14వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించబడుతుందని ఆయన ప్రకటించారు.

ఈ లోక్‌ అదాలత్‌లో చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినల్‌ కేసులతో పాటు రాజీపడదగిన సివిల్‌ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్‌ఫండ్‌ కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, వైవాహిక కేసులు, తగాదాలు, ట్రాఫిక్‌ కేసులు తదితర అన్ని కేసులకు సంబంధించి సత్వర పరిష్కారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.

ఇరువర్గాల కక్షిదారులు ఈ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎస్‌.పి మనాన్‌ భట్‌, అదనపు డిసిపి రవి, సిసిఆర్‌బి ఇన్స్‌పెక్టర్లు శ్రీధర్‌ రావు, శ్రీనివాస్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .