పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
గాలి కుంటు వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవాలి
Views: 170
On
జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి
డా. వై రాథాకిషన్
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:మండల కేంద్రంలో మండల పశు వైద్యాధికారి డా.సిహెచ్ రజిత ఆద్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి డా. వై రాథాకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం సిబ్బందికి, రైతులకు పలు సూచనలు చేశారు.వారు మాట్లాడుతూ... కాలానుగుణంగా పశువులకు వచ్చే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే గాలి కుంటు వ్యాధి కారణంగా పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. అదే విధంగా కాడేద్దులు తీవ్ర అస్వస్థతకు గురి అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా. డి సారంగపాణి, వెటర్నరీ అసిస్టెంట్ మంజుల, గోపాల మిత్రలు చిలువేరు నగేష్, రాజు,రైతులు తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments