సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి తెలంగాణ దళిత సంఘాలు  ఖండించాయి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి తెలంగాణ దళిత సంఘాలు  ఖండించాయి

మేడ్చల్ జిల్లా, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై ఒక న్యాయవాది దాడికి ప్రయత్నించడం దురదృష్ట కరమైన సంఘటనగా తెలంగాణ దళిత సంఘాల ఐక్యసంఘం రాష్ట్ర కమిటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు సానాది సాయిబాబ పేర్కొన్నారు.ఒక న్యాయవాదిగా ఉండి అత్యున్నత న్యాయస్థానం ప్రధానుడు పై దాడికి పూనుకోవడం అనాగరికం, హేయమైన చర్య అని సాయిబాబ అన్నారు. "న్యాయవ్య వస్థను గౌరవించాల్సిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం మానవతా విరుద్ధం. ఈ దాడిని ప్రజాస్వామ్య, పార్లమెంటరీ మరియు న్యాయ వ్యవస్థలపై వ్యతిరేకమైన చర్యగా పరిగణించి, దానిపై కఠిన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయి బాబ ఈ ఘటనను దేశంలోని సామాజిక పౌరుల పరిస్థితికి ప్రతికూలంగా భావిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆయన చెప్పినట్లుగా, "సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధి నిర్వహణలో ఉండగా ఇలాంటి పాశవిక చర్యలు జరగడం ఏ విధమైన సమాజంలోనూ అనుమతించరాదు. ఒక న్యాయవాదిగా చదువుకున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం విస్మయాన్ని కలిగిస్తుంది" అని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .