ఈ నెల 5,6న తెలంగాణ శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సు

కీసరలో గోడపత్రిక ఆవిష్కరించిన సంస్థ ప్రతినిధులు 

ఈ నెల 5,6న తెలంగాణ శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సు

కీసర, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్చించేందుకు తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర 5వ సదస్సు అక్టోబర్ 5, 6న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సదస్సులో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎం. రేవతి కళ్యాణి తెలిపారు.శుక్రవారం కీసరలో ఆమె సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మహిళా ఉద్యమ నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని, శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరుగుతాయని తెలిపారు.

సదస్సు ముఖ్యాంశాలు:

అక్టోబర్ 5: ఎస్‌పీఎం క్రికెట్ గ్రౌండ్ నుండి ఎస్‌బీఐ బ్యాంక్, రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో అఖిల భారత కార్మిక నాయకులు ప్రసంగించనున్నారు. ఈ సభకు సీ ఐ టీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆర్. త్రివేణి అధ్యక్షత వహించనున్నారు. జాతీయ కార్యదర్శి దీపా కె. రాజన్, జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, సీ ఐ టీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్.వి. రమ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు.

అక్టోబర్ 6: ప్రతినిధుల సమావేశంలో మహిళల సమస్యలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మహిళా ప్రతినిధులు పాల్గొననుండగా, మేడ్చల్ జిల్లా నుండి విశేష సంఖ్యలో హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .