ఘనంగా శ్రీశ్రీశ్రీ కోమటోళ్ళ మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు 

ఘనంగా శ్రీశ్రీశ్రీ కోమటోళ్ళ మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామం జాతీయ రహదారి 44 దగ్గర ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ కొమటోళ్ల మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం 400 కేవి విద్యుత్ సబ్స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో  మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దశమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన ఆర్ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వార్షికోత్సవ పూజలో భాగంగా అభిషేకాలు, కుంకుమార్చనలు, మహాపూర్తహుతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  గ్రామానికి చెందిన భక్తులు, విద్యుత్ అధికారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు, విద్యుత్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .