15వ బెటాలియన్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
సత్తుపల్లి, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం, బి గంగారం గ్రామంలో 15వ ప్రత్యేక పోలీసు పటాలములో శుక్రవారం నాడు చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పటాలపు కమాండెంట్ ఎన్ పెదబాబు హాజరై చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమాండెంట్ ఎన్ పెదబాబు మాట్లాడుతూ, తెలంగాణ అంటేనే ఒక తెగువ పోరాటం అని అన్నారు. 1949 సంవత్సరంలో జరిగిన ప్రజా ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమని చెప్పారు. ఆ సాయుధ పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తుచేశారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన చాకలి ఐలమ్మ పోరాటం చూపించిన ధైర్యం సాయుధ పోరాటానికి స్పూర్తి నిచ్చిందని అన్నారు. అటువంటి మహనీయురాలి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకలకు అదనపు కమాండెంట్ ఏ అంజయ్య సహాయ దళాధిపతులు ఎస్ శ్రీధరరాజా, ఎస్ డి రంగారెడ్డి, ఆర్ ఐలు, ఆర్ ఎస్ ఐలు, పటాలపు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు


Comments