వేముల ఘటన నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలి

జిల్లా బిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్ 

వేముల ఘటన నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలి

వనపర్తి,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల  చెందిన మాల ప్రవళిక అనే దళిత యువతిని మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ యువకులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని వనపర్తి జిల్లా బిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ విభాగం డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా జిల్లా బిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. దిశా చట్టం తరహాలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాలు, హత్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నార్థకంగా మారాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో జైలు భరోసా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని జిల్లా బిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ స్పష్టం చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .