చిలకనగర్‌లో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు

చిలకనగర్‌లో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు

చిలకనగర్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):

చిలకనగర్ డివిజన్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆలయ మహిమను వివరించారు.
ఆమె మాట్లాడుతూ ఎన్జిఆర్ఐలోని అభయాంజనేయ స్వామి ఆలయం ప్రఖ్యాతి గాంచిందని, ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె. వెంకన్న, ఆలయ చైర్మన్ దిక్కుమల్ల అంజయ్య గుప్తా, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నాయకులు కోుండా జగన్ రామాంజనేయులు, శ్యామ్, దాత సంతోష్ కుమార్ నంద, వేణుగోపాల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, అర్చకులు గంభీరపురం రవీంద్ర శర్మ, సంతోష్, మాజీ చైర్మన్లు లక్ష్మీనారాయణ, నాగయ్య, అంజయ్య, వెంకట్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .