రుద్రాక్షపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.

ఆదివాసీల పెద్ద ఎత్తున చేరిక.

సత్తుపల్లి, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పర్యవేక్షణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా రుద్రాక్షపల్లి పరిధిలోని సుమారు 50 ఆదివాసీ కుటుంబాలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మట్టా దయానంద్ మాట్లాడుతూ, రుద్రాక్షపల్లి పంచాయతీ జడ్పీటీసీ అభ్యర్థిగా కిసర రాంబాబు, ఎంపీటీసీ అభ్యర్థిగా కోర్సా వసంతరావు, సర్పంచ్ అభ్యర్థిగా పాయం నాగేంద్రబాబు పేర్లను ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో మొదటిసారిగా ఆదివాసీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించడం విశేషమని ఆయన అన్నారు.

ఇక తోగ్గుడెం, రంగాపురం, సత్యంపేట, బాసారం, కొమ్ముగూడెం, రుద్రాక్షపల్లి గ్రామాలు గత 20 ఏళ్లుగా అభివృద్ధి లో వెనుకబడి ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో మట్టిరోడ్లు లేకుండా ప్రతి గ్రామానికీ పక్కా రహదారులు వేస్తామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిటీ హాలు, బతుకమ్మ ఘాట్ నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని తెలిపారు. ప్రకటించిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రుద్రాక్షపల్లి ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ వేణు, రుద్రాక్షపల్లి పంచాయతీ కాంగ్రెస్ కమిటీ నాయకులు, మహిళా, యూత్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .