బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో తక్షణమే ప్రవేశపెట్టాలి
నాచారం, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో తక్షణమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ, “రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమని తెలిసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో విఫలమైంది” అని విమర్శించారు.అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. “ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి,” అని జంగయ్య డిమాండ్ చేశారు.
బీసీల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు రవి, నాగరాజు, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేంద్ర, నిఖిల్, శరత్ గౌడ్, ప్రసాద్, భాను, వెంకట్, ప్రణయ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.


Comments