ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలి
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Views: 12
On
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య, కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాక్కడేతో కలిసి ఎల్కతుర్తి జంక్షన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “లైటింగ్, జంక్షన్ నిర్మాణ పనులను శ్రద్ధగా నిర్వహించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేయాలి,” అని సూచించారు.
పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, సమయానికి పూర్తి చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments