ఆర్ఎస్ఎస్ విధానాలనే బిజెపి అనుసరిస్తుంది.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మాదినేని రమేష్.
సత్తుపల్లి, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక రావి వీరవెంకయ్య భవనం లో సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం రావుల రాజాబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశం సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్ మాట్లాడుతూ, బిజెపి ఆర్ఎస్ఎస్ విధానాలతో ముందుకు పోతుందన్నారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ విధానాలను బలపరుస్తూ దేశానికి ఆర్ఎస్ఎస్ ఎన్జీవో అని అనటం శోచనీయం అని అన్నారు. ఒకపక్క పార్లమెంట్లో లో ఓట్ల తొలగింపు పై చర్చ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగింపు నిరసనగా పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కేంద్రం చేస్తుందన్నారు. ముస్లిం ఓట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారం దాహం కోసం కుట్ర పన్నుతుంది అని అన్నారు. ఎన్నికల సంఘాన్ని, ఈడి, సిబిఐ సంస్థలను బిజెపి పావుగా వాడుకొని రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఓటర్ సవరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రం రాష్ట్రాలకు రావలసిన యూరియా ఆరున్నర లక్షల టన్నులు యూరియా రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4 లక్షల టన్నులు మాత్రమే ఇవ్వటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత వచ్చిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియాను అందించి రైతన్నలను ఆదుకోవాలని అన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు. ఉన్న యూరియాను రైతులందరికీ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరావు, చావా రమేష్, వలి, భాస్కర్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


Comments