చింతకానిలో సీపీఐ పార్టీ సత్తా చాటాలి.
6 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ
సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;
చింతకాని మండలంలో సీపీఐ పూర్వ వైభవం చాటాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు పేర్కొన్నారు. గురువారం చింతకాని మండల సీపీఐ పార్టీ కార్యాలయంలో పదిమల వెంకటనర్సయ్య అధ్యక్షతన జరిగిన మండల సమితి సమావేశంలో భాగం హేమంతరావు మాట్లాడుతూ సీపీఐ కాంగ్రెస్ పొత్తుకు సిద్దంగా ఉందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. నాగిలిగొండ, నేరడ, కొదుమూరు, రామకృష్ణాపురం, ప్రొద్దుటూరు, చిన్నమండవ ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు స్థానిక నాయకత్వం సిద్ధంగా ఉండాలని సూచించారు. సీపీఐ జడ్పీటీసీ అభ్యర్ధిగా పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు, రాఘవావపురం మాజీ సర్పంచ్ కొండవర్తి గోవిందరావును మండల కౌన్సిల్ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. పార్టీ నిర్ణయం మేరకు స్థానిక నాయకత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, రాష్ట్ర నమితి సభ్యులు కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ నభ్యులు ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లిఖార్జునరావు, కూచివపుడి రవి, పార్టీ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, సహాయ కార్యదర్శులు మార్గం శ్రీను, అబ్బూరి మహేష్, జిల్లా సమితి సభ్యులు రాసాల మోహన్ రావు, కన్నెబోయిన విజయమ్మ, నాయకులు దొబ్బల వెంగళరావు, గోగుల ఆది, కొల్లి రవి, పగిళ్లపల్లి ఏను తదితరులు పాల్గొన్నారు.


Comments