స్మార్ట్ సిటీ మిషన్‌కు గడువు పొడగించాలి

నగర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం కొనసాగించాలి

స్మార్ట్ సిటీ మిషన్‌కు గడువు పొడగించాలి

-పార్లమెంట్‌లో వరంగల్ ఎంపి  డాక్టర్ కడియం కావ్య


న్యూఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తికాకముందే కేంద్ర మిషన్ గడువు ముగిసిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు గడువును జూన్ 2026 వరకు పొడిగించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలంటే మిషన్ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఈ మేరకు ఆమె అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు రాతపూర్వక సమాధానమిచ్చారు. ఆయన పేర్కొనగా, స్మార్ట్ సిటీ మిషన్‌ గడువు ఇప్పటికే మార్చి 31, 2025తో ముగిసిందని, ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన పనులను ప్రతి నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన సంస్థలు (ఎస్పివి లు) ద్వారానే పూర్తిచేయాలని తెలిపారు.

ప్రస్తుతం వరంగల్ నగరంలో మొత్తం రూ.1,800 కోట్ల ప్రాజెక్టుల్లో రూ.1,386 కోట్ల విలువైన 119 పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.415 కోట్లతో 40 పనులు కొనసాగుతున్నాయి. అదే విధంగా, కరీంనగర్‌లో రూ.1,094 కోట్లలో రూ.979 కోట్ల విలువైన 49 పనులు పూర్తయ్యాయి. రూ.115 కోట్లతో మరో 12 పనులు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్ సభలో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా పట్టణ అభివృద్ధి వేగంగా సాగుతోందని పేర్కొన్నారు. మిషన్ గడువు ముగిసినప్పటికీ నగరాల్లో మిగిలిన పనులకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పట్టణాల్లో మౌలిక సదుపాయాల పెంపుదలకు కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .