గాజులరామారం బస్తీలలో పేదల ఇళ్ళ ధ్వంసం – ఈటల రాజేందర్ ఆవేదన

గాజులరామారం బస్తీలలో పేదల ఇళ్ళ ధ్వంసం – ఈటల రాజేందర్ ఆవేదన

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం ప్రాంతంలో ఐదు బస్తీలలో పేదల ఇళ్లు కూల్చివేత కలకలం రేపింది. హైడ్రా యంత్రాలతో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో దాదాపు 300 గుడిసె లు కూల్చివేయబడ్డాయి.ఇళ్ల కోలతో అనేక కుటుంబాలు రాత్రంతా వర్షంలో చిన్నపిల్లల తో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరెంటు స్తంభాలను కూడా కూలగొట్టడంతో ప్రాంతం విద్యుత్‌ లేకుండా పోయింది. తాగునీటి సౌకర్యం కూడా నిలిచిపోయింది.ఈ ఘటనపై మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఉదయం బస్తీలను సందర్శించి బాధితులతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ – “నిజాంలు, రాజులు కూడా ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తించలేదు. 40 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న వడ్డెరలు, కూలీలు, పేదవారి ఇళ్ళను కూల్చడం హృదయవిదారకం. బతుకమ్మ పండుగ రోజే చిన్న పిల్లలతో వర్షంలో రోడ్డుపై ఉండే పరిస్థితి తెచ్చారు. ఇది శత్రుదేశం మీద దాడి చేసినట్టే” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈటల రాజేందర్  మాట్లాడు తూ,“బ్రోకర్ల ఉంటే అరెస్ట్ చేయండి, డబ్బులు రికవరీ చేయండి కానీ పేదల జీవితాలతో ఆడుకో వద్దు.”“300 గుడిసెలు కూల్చి 15 వేల కోట్ల ఆస్తిని కాపాడామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.”WhatsApp Image 2025-09-22 at 3.16.04 PM
“ప్రభుత్వ భూములు పేదలకు దక్కాలి, బిల్డర్లు – బ్రోకర్లకు కాదు.” అని ఘాటుగా విమర్శించారు.ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వెంటనే కూల్చివేత బాధితులకు కరెంటు, తాగునీటి సదుపాయాలు పునరుద్ధరించడంతో పాటు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.బస్తీ ప్రాంతాల్లో నరసింహ బస్తీ, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీల ప్రజలతో ఈటల నేరుగా మాట్లాడారు. “పిల్లల పుస్తకాలు, ఇంటి సామాన్లను తొక్కించి, కన్నీటి మధ్య పేదలను రోడ్డుపైకి నెట్టేయడం అమానవీయ చర్య” అని విమర్శించారు.“పేదల జోలికి వస్తే మాడి మసి అవుతారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .