గ్రామాల్లో శాంతియుతంగా దసరా పండుగ జరుపుకోవాలి
ధర్మసాగర్ సీఐ కే.శ్రీధర్ రావు
ధర్మసాగర్,సెప్టెంబర్28 (తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ రావు శాంతి భద్రతల పట్ల అప్రమత్తంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ధర్మసాగర్ మండల పరిధిలోని గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రజలు సౌహార్ద్ర వాతావరణంలో పాల్గొనేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు.
సాంస్కృతిక పండుగలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని గుర్తుచేసిన సీఐ, వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు తమ గ్రామాల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని, కానీ ప్రజల సహకారం ఉంటే పండుగలు మరింత సాఫీగా సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
అలాగే అక్టోబర్ 2న జరగబోయే గాంధీ జయంతి సందర్భంగా ఎలాంటి జీవహింస చేయకూడదని, గాంధీ ఆచరణలో చూపిన అహింస సూత్రాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ధర్మసాగర్‌లో పండుగలు శాంతియుతంగా, సాంస్కృతిక వాతావరణంలో జరిగేలా పోలీసు విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని సీఐ శ్రీధర్ రావు తెలిపారు.


Comments