విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని విద్య కమిషన్
బీఆర్ఎస్ యువ నాయకుడు పోలిశెట్టి ప్రతాప్
Views: 37
On
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
విద్యాశాఖ మంత్రి లేకుండా సంవత్సరం పాలన విద్యా వ్యవస్థ పై కనీసం సమీక్ష కూడా లేదని ఖిల్లా ఘనపూర్ మండల బీఆర్ఎస్ యువ నాయకుడు పోలిశెట్టి ప్రతాప్ విమర్శించారు. గురుకుల సంక్షేమ హాస్టల్లు, జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతలేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఫుడ్ పాయిజన్ తో అవస్థకు గురవుతున్నారు అంటూ బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు పోలిశెట్టి ప్రతాప్ అన్నారు . శనివారం ఒక ప్రకటనలో అయన మాట్లాడుతూ.. ఒకే ఉన్నత పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్, అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు లేదు, గురుకులాలో మౌలిక వసతులు లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. భవిష్యత్తులో ఇదే పునరావతమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి పక్షాన బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతమని హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments