తొలగించిన చిరు వ్యాపారుల సముదాయాలను వెంటనే పునర్నిర్మించాలి

 చిరు వ్యాపారుల సంఘ నాయకుల డిమాండ్.

తొలగించిన చిరు వ్యాపారుల సముదాయాలను వెంటనే పునర్నిర్మించాలి

 ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు 

త్రీ నగరంలో చిరు వ్యాపారులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ప్రభుత్వ అధికారులు సహకరించేందుకు ట్రై సిటీలో తొలగించిన చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను వెంటనే పునర్నిర్మించాలని చిరు వ్యాపారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాజీపేటలోని మీడియా పాయింట్లు శనివారం బిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం బి ఆర్ టి యు ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సంఘం నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు నాయిని రవి ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ నగరంలో చిరు వ్యాపారులు ఎవరి దయా దక్షిణాల మీద బ్రతకావలసిన అవసరం లేదని, చిరు వ్యాపారుల రక్షణ చట్టం 2014 ప్రకారం రావలసిన హక్కుల కోసం మేమందరం ఐక్యంగా ప్రభుత్వ అధికారులపై సంయుక్తంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ఇటీవల కాలంలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ నగరంలో అధికారులు తొలగించిన వ్యాపార సముదాయాలను వెంటనే పునర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి వ్యాపార నిర్వహణకు కావలసిన పునర్నిర్మానాన్ని చేయించాలని వారు కోరారు. గత ప్రభుత్వం నిర్వహించిన నిర్వహణ కేంద్రాలను కొనసాగించి, మెలక సదుపాయాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు.  నగరంలో సుమారు 20వేల కుటుంబాలు చిరు వ్యాపారం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని ప్రభుత్వం, పోలీస్, మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల ను ఆవేదనలకు గురి చేయడం సబబు కాదన్నారు. తమకు చట్ట ప్రకారం రక్షణ కల్పించాలని లేకుంటే అన్ని కార్మిక సంఘాల కలుపుకొని పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. నగరంలో తొలగించిన వ్యాపారుల కేంద్రాలను తక్షణమే పునర్ నిర్మించాలి, వీధి చిరు వ్యాపారులకు వ్యాపార సముదాయ కేంద్రాల నిర్వహించి సహకరించాలి నిర్మించి మెలిక సదుపాయాలు కల్పించాలి,  మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులకు సర్టిఫికెట్ ఐడి కార్డులు జారీ చేయాలి,  చిరు వ్యాపారులు టౌన్ కమిటీలను నిర్వహించి వారికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి,  జిల్లా నగర ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించి చిరు వ్యాపారుల చట్టం అమలు చేయాలి,  చిరు వ్యాపారులను ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలంటూ ఈ సందర్భంగా   పలు డిమాండ్లను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లారు ఈ సమావేశంలో బిఆర్ టియు చిరు వ్యాపార సంఘం నాయకులు లింగాల మల్లేశం హోటల్ యూనియన్ అధ్యక్షులు రఘు ,అరుణ్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .