మొదటి రోజు విజయవంతమైన ద్యానోత్సవం
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో మూడు రోజుల ధ్యాన ఉత్సవం శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొదటిరోజున ద్యానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూసుపంచి మాజీ సర్పంచ్ చెన్న మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా కుసుమంచి ప్రజానీకానికి ఇంత మంచి కార్యక్రమం అందజేస్తున్న హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారిని అభినందించారు. మిగతా రెండు రోజులు జరుగు ధ్యాన ఉత్సవం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం హార్ట్ ఫుల్ నెస్ కోఆర్డినేటర్ టి నరసింహా చారి మాట్లాడుతూ సమగ్ర ఆరోగ్యానికి ద్యానం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్స్ ఏ నరేందర్, కె అనురాధ, ఎన్ కరుణాకర్, వేల్లంపల్లి రాజేంద్రప్రసాద్, ఎం కవిత, బి జ్యోతి, పి అరుణ, మోహన్ మురళీ, గ్రామ పెద్దలు భారీ భద్రం, బోనగిరి రాజేంద్రప్రసాద్, అద్దంకి ఉపేంద్ర చారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments