స్వతంత్ర ఫలాలు పేదలకు అందాలి పెరుగుతున్న మతోన్మాదం దేశానికి ప్రమాదం
సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ఉద్యమం :
78 ఏళ్ల స్వతంత్ర భారతంలో అట్టడుగు వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగాలని దురదృష్టవశాత్తు అటువంటి పరిస్థితులు దేశంలో లేవని ఆయన తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గిరిప్రసాద్ భవన్లో జాతీయ పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని దేశ సంపద పొగుపడుతుందని ఆయన తెలిపారు. ఆర్ధిక అంతరాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని పాలకులు దీనిని గుర్తించడం లేదన్నారు. మతోన్మాదం పెరుగుతుందని ఉన్మాద చర్యలు ప్రజల మధ్య ఒక్యతను దెబ్బతీస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, ఎస్ కె జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, శివరామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, ఏఐవైఎస్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, గాదె లక్ష్మినారాయణ, జిల్లా సమితి సభ్యులు సైదా, జాకీర్ తదితరులు పాల్గొన్నారు..


Comments