సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వం భరోసా కల్పించాలి
-బత్తుల మహేష్ గౌడ్,రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సంయుక్త కార్యదర్శి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
సామాన్య ప్రజలకు సమాచార హక్కు చట్టంపై మరింత భరోసా కల్పించాలని,ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన బత్తుల మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు.
బుధవారం నగరంలోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సూర స్రవంతి మహేష్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “ఆర్టీఐ చట్టం కాలక్రమేణా నిర్లక్ష్యం చెందబడుతోంది. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో జాప్యం చేస్తోంది. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం పౌరసమాచార అధికారులతో ప్రత్యేక కమిషన్ కోర్టులను ఏర్పాటు చేయాలని, దరఖాస్తుదారుల సమాచార అవసరాలు 30 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.
ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంపొందించాలని, సామాన్యులు అడిగిన సమాచారాన్ని నిర్దేశిత కాలవ్యవధిలో అందించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు గంగా ప్రియ రెడ్డి, లక్ష్మీ ప్రియ యాదగిరి గౌడ్, వి. దయాకర్ రెడ్డి, జి. కుమార్ యాదవ్, లగ్గొని శ్రీనివాస్ గౌడ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments