మహమ్మద్ ప్రవక్త ( స) జీవితం ప్రపంచ మానవాళికి మార్గదర్శకం
జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షురాలు అస్మా అంజుమ్
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 20, తెలంగాణ ముచ్చట్లు;
జమాతే ఇస్లామి హింద్ ఇందిరానగర్ నార్త్ శాఖ కార్యాలయంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రవక్త సందేశ ప్రచార ఉద్యమంలో భాగంగా నేడు నార్త్ అధ్యక్షురాలు హుస్సేన్ బి అధ్యక్షతన మహిళా పండితుల సమావేశం నిర్వహించబడింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు అస్మా అంజుమ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త (సఅసం) జీవితం మనందరికీ మార్గదర్శకమని ఆయన ప్రజల పట్ల ఎంతో జాలి, కరుణ, ఆదరణ చూపించే వారనీ ఆయన నోటి ద్వారా చేతల ద్వారా ఎప్పుడు ఏ ఒక్కరిని ఇబ్బంది కలిగించలేదని ,ఆయన అనుచరులుగా మనం కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవాలన్నారు. మహమ్మద్ ప్రవక్త ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఆదర్శ దైవదాసుడిగా ,గొప్ప పరిపాలకుడిగా, ఒక స్నేహితుడిగా, ఆయన ఆదర్శ జీవితం ఒక తెరిచిన పుస్తకంలా మన ముందున్నదని ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఆచరించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయన ఆదర్శ బోధనలు పాటిస్తే సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం సోదర భావం వెలసిల్లుతాయని తెలియజేశారు. అనంతరం ఇస్లాం మహిళా పండితుల అధ్యక్షురాలు ఖాసీమా షాహిన్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ (స ) బోధనలు ఊటంకిస్తూ ఆయన ఆదర్శ జీవితం ,ఉత్తమమైన నడవడిక, ఆయన గుణగణాలు గురించి శ్రోతల హృదయాలను కదిలించే విధంగా ప్రసంగించారు .నేటికి ఆయన జీవితం ముస్లింలకే కాక ప్రపంచ మానవులందరికీ ఆదర్శమని, ఆయన బోధనలను అందరూ తూ.చా .తప్పకుండా పాటించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందన్నారు. ఈ కారిక్రమంలో ఖమ్మం సెంట్రల్ అధ్యక్షురాలు అస్ఫీయ అంజుమ్ ,ఖమ్మం సౌత్ అధ్యక్షురాలు నాజియా తబస్సుమ్ జమాత్ సభ్యులు ఆరిఫా, హబీబా ,సాలే హ తస్లీమ్, జహరా ఫాతిమా, సబిహ , ఫాతిమా , తబస్సుం, ఆస్మా , నసీమా ,శంసున్నిసా మరియు మహిళా మహిళా ఇస్లామియా పండితులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు


Comments