కాంట్రాక్టర్ లైన్మెన్ రవి మృతికి కారకులైన లైన్మెన్లను సస్పెండ్ చేయాలి
--బీఎస్పీ నాయకులు బసిరెడ్డి సంతోష్
వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలానికి చెందిన విద్యుత్ కార్మికుడు రవి గతవారం విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. శనివారం రవి దశదిన కర్మ కార్యక్రమానికి దేవరకద్ర బీఎస్పీ నాయకులు బసిరెడ్డి సంతోష్ రెడ్డి హాజరయ్యారు. అడ్డాకుల మండల పరిధిలో, కాటారం గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో, స్థానిక కాంట్రాక్టు లైన్ మెన్ ఎం.రవి విద్యుత్ పునరుద్దించడానికి తిమ్మ పల్లెకు ఎల్సీ కావాలని, సబ్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న లైన్మెన్ గట్టప్ప, వెంకటేష్ విషయం తెలుపగా, వాళ్లు గుడిబండ కు ఎల్ సి ఇవ్వడం జరిగింది. వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఏం.రవి ప్రాణం బలైపోయింది. కనుక, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఆరోజు డ్యూటీలో ఉన్న లైన్మెన్లను సస్పెండ్ చేయాలని దేవరకద్ర నియోజకవర్గo బిఎస్పీ పార్టీ నాయకులు బసిరెడ్డి సంతోష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Comments