విద్యుత్ కార్మికుల సమస్య ను వెంటనే పరిష్కరించాలి 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్. బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ 

విద్యుత్ కార్మికుల సమస్య ను వెంటనే పరిష్కరించాలి 

భీమదేవరపల్లి, ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు)

 తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెకు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ పూర్తి మద్దతూ తెలియజేస్తున్నరు.

కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల సమస్యలు. నాటి బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి. ప్రమాదకరమైన విధులు నిర్వర్తిస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదు. ఎలాంటి హామీలు లేవు. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించి తుంగలో తొక్కుతున్నారు. సచివాలయల ముందు విగ్రహాలు, ఫుట్‌బాల్ టోర్నీల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాణాలను పణంగా పెట్టి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్న విద్యుత్ కార్మికులకు మాత్రం న్యాయం చేయడం లేదు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం, సమాన పనికి సమాన వేతనం, ప్రమాద బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం, కార్మిక చట్టాలు అమలు చేయడం.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుంటే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేమే చేశాం అని గొప్పలు చెప్పుకుంటూ కార్మికులను మోసం చేస్తోంది.

కావున, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేస్తోంది. కార్మికుల పోరాటానికి బిజెపి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .