ఓబీసీ రిజర్వేషన్ల ప్రదాత బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ 

 -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ 

ఓబీసీ రిజర్వేషన్ల ప్రదాత బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 దేశంలో 52 శాతం వెనకబడి ఉన్న ఓబీసీ కులాలకు కమిషన్ చైర్మన్ హోదాలో దేశమంతటా తిరిగి బీసీ కులాలకు జరుగుతున్న ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలను, అన్యాయాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు అందజేసి 27 శాతం రిజర్వేషన్ ఫలాలను అందించిన బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ ఓబిసి కులాల రిజర్వేషన్ల ప్రదాత అని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొనియాడారు. ఆదివారం నాడు కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాలవేసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారని, బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ఇకనైనా ఓబీసీలు అంత సంఘటనమై మండల్ ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 1918లో ఆగస్టు 25న బీహార్ లో ఒక జమీందారు కుటుంబంలో జన్మించిన బిందెశ్వర ప్రసాద్ విలాసవంతమైన జీవితం గడపాల్సి ఉన్నప్పటికీ కేవలం ఓబీసీ రిజర్వేషన్ల కొరకు నిరంతరం ఉద్యమించారని, ఈ నేపథ్యంలో బీహార్ కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, కమిషన్ చైర్మన్ గా అత్యున్నత పదవులు అనుభవించినప్పటికీ , కేవలం అట్టడుగున ఉన్న పేదల కొరకు బీసీల కొరకు న్యాయం చేయడం కోసం తమ పదవులను కూడా త్యాగం చేసి న ఘనత వారికే దక్కిందని అభిప్రాయపడ్డారు.ఈకార్యక్రమంలో బానోత్ నరసింహ నాయక్, శీలం పుల్లయ్య, మేకల మల్లికార్జునరావు, మేకల మహేష్, వెంకటేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్,జక్కంపూడి వెంకటేశ్వర్లు, బద్దల శేఖర్,అరవ లాల కృష్ణ, చింతల పెద్ద వెంకయ్య చింతల చిన్న వెంకయ్య, ప్రసాద్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .