మహనీయుల త్యాగ ఫలితమే నేడు స్వేచ్ఛా స్వాతంత్ర్యం

కెజిబివి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బండారు ఇందిర

మహనీయుల త్యాగ ఫలితమే నేడు స్వేచ్ఛా స్వాతంత్ర్యం

 ముదిగొండ మండలం, న్యూ లక్ష్మీపురం కేజీబీవీ పాఠశాలలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

దేశ స్వాతంత్రం కోసం పోరాడి అమరులైన మహనీయుల త్యాగాల ఫలితమే నేడు స్వేచ్ఛగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని ముదిగొండ కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బండారు ఇందిర అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, న్యూ లక్ష్మీపురం కేజీబీవీ పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ బండారు ఇందిర జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి ఎందరో మహనీయుల చరిత్రలను పుస్తక పఠనం ద్వారా తెలుసుకొని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వారి ఆశయ సాధనకోసం విద్యార్థినులు బాగా కష్టపడి ప్రణాళికతో చదివి ఉన్నత శిఖరాలకు చేరినప్పుడే ఆ మహనీయుల త్యాగాలకు అర్ధం ఉంటుంది అప్పుడే దేశ అభ్యున్నతికి పాటుపడినవారమౌతామన్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గ్రామ మాజీ సర్పంచ్ ఎండి హజ్గర్, అధ్యాపకులు నిర్మల, నాగమణి, స్వాతి, జ్యోతి, ఉమ, రాధ, సఫీయా బేగం, యాస్మిన్, సుజాత, సుమలత(తెలుగు), సుమలత(ఫిజిక్స్), అకౌంటెంట్ మాధవి, పిఈటి సునీత, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .