సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం

జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ 

సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికలు జరుగగా, రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా రామగళ్ళ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మల్లం శ్రీనివాస్, మహిళా ఉపాధ్యక్షురాలిగా వేముల పుష్పలత, సంయుక్త కార్యదర్శిగా దీపక్ కులకర్ణి, గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధిగా రాసునూరి లక్ష్మణ్ లు ఎన్నికయ్యారు. ఈ నియామక పత్రాలను సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి అందజేశారు.

ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ, 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రభుత్వ కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు కావాలని అన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోగా అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని, అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల్లోనే సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఈ చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని, దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ప్రతి పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల పనితీరును తనిఖీ చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం 4(1)బి సెక్షన్‌ కింద 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు స్వచ్చందంగా అందించాలని, మూడో వ్యక్తి సమాచారం విషయంలో ప్రజా ప్రయోజనాల మేరకు సెక్షన్‌ 11(1) ప్రకారం సమాచారం అందించవచ్చని వివరించారు.

సమాచారం అందించడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై కనిష్టంగా రూ. 250 నుండి గరిష్టంగా రూ. 25,000 వరకు జరిమానా విధించే హక్కు సమాచార కమిషనర్‌కు ఉందని పేర్కొన్నారు. దేశ భద్రత, కోర్టు జడ్జిమెంట్‌లు, పోలీస్ స్టేషన్ భద్రత వంటి కొన్ని అంశాలు మినహాయించబడ్డాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు జి.ప్రియ రెడ్డి, మహిళా సంయుక్త కార్యదర్శి ఎర్రబెల్లి ప్రగతి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అంతటి అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు ముచ్చర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .