అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకోవాలి 

రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకోవాలి 

సరూర్‌నగర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజల కోసం విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులుగా వ్యవహరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పిలుపునిచ్చారు.బుధవారం రోజు సరూర్‌నగర్ స్టేడియంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు కలిపి సుమారు 2,000 మంది హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రముఖ కవులు సుద్దాల అశోక్ తేజ్, సుధీర్ సంద్ర, డాక్టర్ కవిత ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం నింపారు.సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ,“సమాజానికి సేవలందించి అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవడమే ఈ వారోత్సవాల లక్ష్యం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రతి నిమిషానికి రెండు డయల్ 100 కాల్స్ అందుతుంటాయి. WhatsApp Image 2025-10-29 at 8.37.25 PMప్రజల భద్రత కోసం పోలీసులు ఆరు విభాగాలుగా విభజించబడి విజిబుల్ పోలిసింగ్‌లో భాగంగా నిరంతరం పనిచేస్తున్నారు” అన్నారు.ఆయన మరింతగా చెప్పారు “పిల్లలకు దూరంగా ఉన్న సీనియర్ సిటిజెన్స్‌ను ఇంటింటికి వెళ్లి ఆదుకోవడం, ‘ఆపరేషన్ స్మైలీ’ ద్వారా బాల కార్మికులను గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించడం మా ముఖ్య లక్ష్యం. ప్రజల సహకారంతో రాచకొండ కమిషనరేట్ దేశంలో ఎన్ బి డబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్‌గా నిలిచింది” అని గుర్తు చేశారు.“ప్రజలకు సేవలందించే పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడంలో రాచకొండ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు” అని సిపి తెలిపారు.సుద్దాల అశోక్ తేజ్ మాట్లాడుతూ “దేశం ప్రశాంతంగా ఉండటాని కి  కారణం పోలీసులే. వారిని కృతజ్ఞతతో గౌరవించాలి. ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉన్నట్లే మనమూ ఫ్రెండ్లీ సిటిజెన్స్‌గాఉండాలి”అన్నారు.
సుధీర్ సంద్ర మాట్లాడుతూ “సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్ వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి. పోలీసుల కష్టాలను అర్థం చేసుకొని వారిని గౌరవించాలి” అని సూచించారు.తరువాత సిపి, ఇతర అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీసీపీలు పద్మజా ఐపీఎస్, అనురాధ ఐపీఎస్, ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్, అరవింద్ బాబు, ఇందిరా, ఉషా రాణి, సునీత రెడ్డి, జి.నరసింహ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసులు, నాగలక్ష్మి, మనోహర్, శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!