సింగరేణి సేవా సభ్యుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం
ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి దుర్గం సుమతి రాం చందర్ ప్రశంస
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
సింగరేణి సేవా సభ్యుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి రాంచందర్ ప్రశంసించారు.సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు ఏరియా సింగరేణి ఎంప్లాయిస్ వైవ్స్ అసోసియేషన్ (సేవా) సభ్యుల భాగస్వామ్యంలో సోమవారం ఉదయం పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియం సేవా సమితి స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి దుర్గం సుమతి రామచందర్ గారి చేతుల మీదుగా అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి నూట పాతిక కిలోల బియ్యం నిర్వాహకులు షహనాజ్ కి మరియు సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాల వెలుగు) పాఠశాల ఉపాధ్యాయిని చంద్రకళకు ఐదు వేల రూపాయల వేతన రూపంలో చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సేవ సభ్యుల సామాజిక సేవలను అభినందించారు. అలాగే సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అనేకమంది యువతులకు మహిళలకు చేతివృత్తులలో శిక్షణ ఇప్పిస్తూ మహిళలను ఆర్థిక స్వావంబన దిశగా సంస్థ ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు. శిక్షణ కేంద్రాలను మణుగూరు చుట్టుపక్కల యువతులు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న పలువురు యువతులు మహిళలు తయారుచేసిన డ్రస్సులను స్టాల్ లో ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న యువతులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సేవా సభ్యులు యువతులు సేవా స్టాల్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సందర్శకుల రాకతో స్టాల్ వద్ద ఎంతో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్ చార్జ్ జిఎం వెంకట రామారావు, ఎస్ ఓ టు జి ఎం డి శ్యాంసుందర్, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్, ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్, శారద రామారావు, సేవా సమితి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సింగు శ్రీనివాస్, రామేశ్వర్, సేవా కార్యదర్శి షాకీరా రవూఫ్, అవినాష్, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్,గుర్తింపు సంఘం నాయకులు వై రామ్ గోపాల్, రామ నరసయ్య,ప్రాతినిధ్య సంఘ నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, గట్టయ్య,సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, నాయకులు టీ వీ వి ప్రసాద్, సేవా సభ్యులు జమీలా బేగం, సంధ్య,మాధవి, శోభా, విజయ, రేణుక, ఖత్తార్, రాయుడు సత్యవతి,రమ, ఉమా, కనకలక్ష్మి, కళ్యాణి, బి సత్యవతి, మాధురి, నాగలక్ష్మి, కౌసల్య, ఎం.లక్ష్మి ,ఎం సత్యవతి ,విశాల, కుమారి, ఎం మాధురి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


Comments