అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది 

బి.టి రోడ్డు,హై లెవల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి  సీతక్క,

అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది 

-ములుగు,భూపాలపల్లి నియోజకవర్గాలు నాకు రెండు కళ్ళు

- రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి దనసరి అనసూయ సీతక్క  

- భూపాలపల్లి,తెలంగాణ ముచ్చట్లు:

అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మంత్రి సీతక్క అన్నారు.గణపురం మండలకేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తూ,కష్టపడుతున్న వ్యక్తి గండ్ర సత్యనారాయణ రావు అని పేర్కొన్నారు.శాసనసభ్యుని తపనంత అభివృద్ధి చేయడమే లక్ష్యమని,  ప్రజానాయకుడు సత్యనారాయణ రావు అని కొనియాడారు. నేటికీ రాజ్యాంగం ఏర్పాటు జరిగి 75 సంవత్సరాలు పూర్తి అవుతుందని ఈ శుభ సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.  రాజ్యాంగం లేకుంటే భారతీయులకు  ఎవరికి ప్రశ్నించే, జీవించే  అందరూ సమానమనే హక్కులు లేకుండా పోయేవని తెలిపారు. మహనీయుడు డా. బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని ఆమోదించినటువంటి మహనీయుడు నెహ్రు అని అన్నారు.  నెహ్రు కుటుంబం పేదలకు  భూములు పంచాలి,  సమానత్వం  ఇవ్వాలి, రిజర్వేషన్స్ అమలు, అభివృద్ధి  చేయాలని  తపన బడిన కుటుంబం అని తెలిపారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200లోపు యూనిట్లు ఉచిత  కరెంటు,  పరిశ్రమలు ఏర్పాటు, యినిఫామ్స్ కుట్టే పనులు, మహిళా క్యాంటీన్లు, మహిళలకు పౌల్ట్రీ ఫామ్స్,  గేదెలు పెంపకం వంటి  వ్యాపారాలు చేసేందుకు 19 రకాల వ్యాపారాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మహిళలు సంతోషంగా ఉంటే   ఆ కుటుంబ సంతోషంగా ఉంటుందని... ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ... ఆ ఊరు ఆ ప్రాంతం సంతోషంగా ఉంటుందని కాబట్టే ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు   తెలిపారు.  డా. బిఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం  ప్రకారం ఏ సమాజం అయితే మహిళల అభివృద్ధి పథంలో ముందుతుంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్లు అని తెలిపారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు.  డిసెంబర్ 9వ తేదీన నుండి మహిళలు హైదరాబాద్ లోని  శిల్పకళా వేదికలో వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.  గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ ఈ ప్రభుత్వం సంవత్సరంలోపే 53 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు.  పిల్లలకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు.  గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రైతులకు  రుణమాఫీ చేయలేదని కానీ 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసినట్లు తెలిపారు. 2.లక్ష లకు పైబడిన మిగిలిన రుణాలను కూడా లెక్కలు వేయడం జరిగిందని దాదాపు 10 వేల కోట్లు ఖర్చుతోందని అంచనా వేసినట్లు తెలిపారు.  ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు,  పేదింటి బిడ్డలు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని అట్ట పథకాన్ని చూసి ఓర్వలేక పోతున్నారని  తెలిపారు.  పేదలకు లాభం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓర్వ లేక విమర్శలు చేస్తున్నారని అన్నారు.  నిరుపేదలకు ఇండ్లు  మంజూరు చేసేందుకు ఇందిరమ్మ కమిటీలు వేసి ఇల్లు లేని వారిని నిరుపేదలను గుర్తిస్తున్నామని,  మొదటి ప్రాధాన్యతగా వారికి ఇండ్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.  ప్రతి నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత మోడల్ పాఠశాలలు నిర్మించనున్నామని అన్నారు. గత పాలకులు చేసిన అప్పులకు కోట్ల రూపాయలు వడ్డీ కడుతూనే  ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టినందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.  గుర్రంపేట వెళ్లాలంటే రోడ్డు దాటలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళమని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కృషితో 15 కోట్ల రూపాయలు మంజూరు చేసామని నేడు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. గణపురం నుండి గుర్రంపేట, చెల్పూర్ వరకు  రెండు వరసలు రహదారిగా అభివృద్ధి చేస్తామని చర్యలు  తెలిపారు.  గణపురం మండలంలో మహిళాశక్తి భవన నిర్మాణం  చేస్తామని తెలిపారు.  సత్యనారాయణరావు తో కలిసి  తప్పక ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని  పేర్కొన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలను  ఒకే నియోజకవర్గంగా భావించి  అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.  త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రాంతాన్ని తీసుకొచ్చి అన్ని సమస్యలు సాధనకు కృషి చేస్తామని అన్నారు.  అప్పుడు ఇప్పుడు కూడా ప్రజల పక్షానే  ఉంటూ ప్రజల కష్టాలను పంచుకుంటామని మంత్రి తెలిపారు.  నియోజకవర్గంలో  గల్లి గల్లి తిరుగుతూ ప్రజల కష్టాలు,  సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. సత్యనారాయణరావు నేను ఇద్దరం కలిసి ఈ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.  ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వమని అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ మేము ప్రజా సేవకులమని, ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చడమే ధ్యేయంగా
 రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని తెలిపారు.  నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటున్నామని అన్నారు.  అభివృద్ధిలో పాటు పేద ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల వాగ్దానాలు అమలు చేస్తున్నామని తెలిపారు.  భూపాలపల్లిలో ప్రజలు 
కల్పించిన అవకాశంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతన్నలు నిరుద్యోగ యువత,  బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజలు  ఇచ్చిన ఈ అవకాశాన్ని  నిష్పక్షపాతంగా,  నిజాయితీగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పనిచేస్తూ మీకు సేవకులుగా ఉన్నామని స్పష్టం చేశారు తెలిపారు. తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే ... రాజకీయంగా మండల ప్రజలు నాకు జన్మనిచ్చారని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఈ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ  సభకు మంత్రి సీతక్క విచ్చేసారని అభినందించారు.   మహిళలకు ఉచిత బస్సు, 200 లోపు యూనిట్లు ఉచిత విద్యుత్తు,   500 కే  సిలిండర్,  ఆరోగ్యశ్రీ పథకం పెంపు,  పేదలందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని  చేపట్టామని అన్నారు.  4.50. లక్షలు ఇల్లు కట్టించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.  పేదలందరికీ ఈ నాలుగు సంవత్సరాలు కాలంలో  ఇండ్లు లేని వారందరికీ  ఇందిరమ్మ ఇల్లు కట్టించి తీరుతామని పేర్కొన్నారు.  గత ప్రభుత్వం  7 లక్షల కోట్ల అప్పులు చేసిందని అట్టి అప్పులకు  నెలకు 63 వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఎన్ని  ఎదురైనప్పటికీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మీకు సేవ చేసే కార్యక్రమాలను,  అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రులు  సీతక్క, శ్రీధర్ బాబు సహకారంతో కోటగుళ్లు, పాండవుల గుట్ట, బుగులోని వేంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధితో పాటు గణపురం రిజర్వాయర్ ను టూరిజం హబ్ గా తయారు  చేసేందుకు  ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు.  రేణుక ఎల్లమ్మ దేవాలయానికి 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.  భూపాలపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి భవనం తప్ప రహదారి సౌకర్యం లేదని గత పాలకుల హడావుడిగా ప్రారంభించి సౌకర్యాలు  కల్పన లేకుండా వదిలేసారని విద్యార్థులు కళాశాలకు వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాకు 203 వైద్య సిబ్బంది పోస్టులు అదనంగా మంజూరు చేసినట్లు తెలిపారు.  ఈ ప్రాంత పేదలు వైద్య సేవలకు వరంగల్,  హైదరాబాదు వెళ్లకుండా  నాణ్యమైన, మెరుగైన  వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. 1.10 కోట్లతో  సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు గాంధీనగర్ గుట్ట వద్ద 60 ఎకరాలలో పారిశ్రామిక  పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత పాలకులు 170 ఎకరాలు తమ స్వార్థం కొరకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే   తాను తిరిగి భూమిని వెనక్కు తీసుకొని 60 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్,  40 ఎకరాల్లో పేదలు చదువుకునేందుకు  అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.  146 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.  సంవత్సరంలోపు అట్టి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఘోరి కొత్తపల్లి, టేకుమట్ల మండలాల్లో తహసీల్దార్,  ఎంపీడీవో భవన నిర్మాణానికి 6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.  గొడవటంచ దేవాలయం అభివృద్ధికి 12.20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు.  దేవాలయం వరకు 50 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణానికి నిదులు మంజూరు చేసినట్లు  తెలిపారు. బుగులోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి  
1.50 కోట్లు రూపాయలతో  అటవీశాఖ ద్వారా మెట్లు వెడల్పు చేసేందుకు మంజూరు చేశామని తెలిపారు. గత సంవత్సరం మోరంచపల్లి వద్ద వరదలకు 6 గురు మనుషులు, వేయి విద్యుత్ స్తంభాలు, 11 వందలు మూగజీవులు చనిపోయి 40 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని అప్పటి. ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయలేదని, కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి సీతక్క సహకారంతో 50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మరో 46 కోట్లు మంజూరు కావాల్సి ఉందని ఆర్థిక శాఖలో పెండింగు ఉందని మంజూరు చేపించి పనులు చేపిస్తామని   తెలిపారు.  చనిపోయిన వ్యక్తులకు, అలాగే  గేదెలకు ఆర్థిక సహాయం అందించామని  పేర్కొన్నారు.  124 చెరువులు తెగిపోతే చెరువులలో నీరు ఆపలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందని,  కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మారావుపేట తదితర  124 చెరువులను పునరుద్ధరణ పనులు చేపట్టి ఈ కాలంలో పంట సాగుకు  అవకాశాలు కల్పించమని తెలిపారు.  రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మీ సేవకుడిగా మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు.  భూపాలపల్లిలో  మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు.  గణపురం మండలానికి మండల సమాఖ్య భవనం భేస్మెంట్  స్థాయిలో ఉందని కోటి రూపాయలు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో వచ్చే నెల 9వ తేదీ వరకు ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజపాలన ప్రజా విజయోత్సవ... కళా యాత్ర కార్యక్రమాలు జరువుతున్నామని తెలిపారు.  ఈ ప్రభుత్వం ప్రజల యొక్క  సమస్యలకు జాబుదారితనంగా ఉంటుందని పేర్కొన్నారు.  ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసిన ఘనత  ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు.  ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం  రెండు ర సార్లు వచ్చినా తృణపాయంగా రాహుల్ గాంధీ వదిలేశారని ఆయన పేర్కొన్నారు.  రాహుల్ గాంధీని  ప్రధానమంత్రి చేసే వరకు మనందరం కష్టపడాలని సూచించారు.  అబద్దాలు మొట్టమొదటిగా కెసిఆర్ కుటుంబంలోనే పుట్టాయని కేటీఆర్,  హరీష్ రావు ఎం చేశారని ధర్నా చేస్తున్నారని, ధర్నాలు చేసేటటువంటి హక్కు వాళ్లకు  ఆయన ప్రశ్నించారు.  పేదవాళ్ళ కష్టాలు తీర్చడమే తన వృత్తి అని ఈ నియోజకవర్గ సమస్యలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ ప్రాంత ఇలవేలుపు అయిన కొడవటంచ లక్ష్మి మరసింహా స్వామి మీద ప్రమాణం చేశారు.  ప్రజల అభివృద్ధిలో జవాబుదారిగా  ఉంటామని... ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదాలు మీ దీవెనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేపించారు.
అంతకుముందు వెల్తుర్లపల్లి క్రాస్ రోడ్ నుండి గుర్రంపేట (వయా కొండాపూర్) వరకు 15 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారుWhatsApp Image 2024-11-26 at 6.52.20 PMఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,  అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి పిఎసిఎస్ చైర్మన్ కుమార్ యాదవ్,  మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .