స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
Views: 5
On
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మెరుగైన విద్యా, వైద్య సేవల కల్పనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి ఆయా నిర్మాణ ప్రదేశాలను పరిశీలించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
100 పడకల ఆసుపత్రి నిర్మాణం
స్టేషన్ ఘనపూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం 45.50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఆసుపత్రి నిర్మాణం కోసం ఆర్టీసీ స్థలాన్ని అనుమతించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నేషనల్ హైవే నుండి ఆసుపత్రికి రాకపోక సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్
జఫర్‌గడ్ మండలం కొనాయిచలం గ్రామంలో 21 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ 26 కోట్ల రూపాయలతో డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు లభించాయని, డిసెంబర్ మొదటి వారంలో టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
• ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి అనుమతులు పొందినట్లు వెల్లడించారు.
• ప్లైఓవర్ పక్కన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, వెటర్నరీ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి స్థలాలను పరిశీలించారు.
• స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ మరమ్మత్తులకు 148.76 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, ఆర్అండ్‌బీ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల, అధికారుల సహకారం అవసరమని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments