ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. వెల్టూర్ హరిజనవాడలో జరుగుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని అన్నారు. ఇంటి స్థలం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సర్వేలో వివరాలు నమోదు చేసుకునే విధంగా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. అంతకుముందు వెల్టూర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం హరిజన్ వాడ లోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, సర్వే సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు దయ్యాల శేఖర్, నరాల ఆంజనేయులు, గుండెల ఆంజనేయులు, నరాల మోహన్, ఏర్పుల రాములు తదితరులు పాల్గొన్నారు..jpeg)


Comments