ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
వెల్టూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం అని పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన వెల్టూరు గ్రామంలోని ప్రేయర్ పవర్ చర్చి మరియు మన చర్చి లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయి.
విశ్వ మానవులకు ప్రేమ సౌభాతత్వం పంచిన ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని అన్నారు .అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోంది.శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం.ఏసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుంది. అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుంది.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పాస్టర్ సుధాకర్, సురేష్ కుమార్ చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాస్టర్స్ సురేష్ కుమార్, సుధాకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, వెల్టూర్ ఉన్ని చేనేత పరిశ్రమ సంఘం ప్రెసిడెంట్ సి .వెంకటేశ్వర్లు, వివేకానంద,పట్నం సత్యన్న తదితరులు పాల్గొన్నారు.


Comments