నాయి బ్రాహ్మణుల సంక్షేమంకోసం యూత్ కమిటీ పాటుపడాలి
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్, కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాసరావు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;
నూతనంగా ఎన్నికైన నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం టౌన్ యూత్ కమిటీ నాయి బ్రాహ్మణుల సంక్షేమాభివృద్ది కోసం పాటుపడాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్, కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం నగరంలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో మంగళవారం నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం టౌన్ యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం టౌన్ యూత్ ప్రెసిడెంట్ గా అద్దంకి రవి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా గుండ్లపల్లి నరేష్, సురభి కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గా జూలూరు మహేష్, జనరల్ సెక్రటరీ గా దోమకొండ మధు, సెక్రటరీ గా ఆలేటి రవితేజ, యూత్ కోశాధికారిగా జూలూరి నాగరాజు, యూత్ ప్రచార కార్యదర్శిగా యలమందల నవీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Comments