పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్న యువకుడు
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు :
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం జరిగిన ఘటనకు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భార్యాభర్తల పంచాయతీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని పట్టించుకున్నాడు. అతన్ని అడ్డుకుబోయిన పోలీసులకు నిప్పంటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటీన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండాకు చెందిన లాకవత్ శీను, అతని భార్య రాధిక మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో శ్రీనును పోలీసులు పాలకుర్తి పోలీస్ స్టేషన్ పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా శ్రీను తన వాహనంలోని పెట్రోలు తీసి తన ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమై కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ రవీందర్‌కు ఆ మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన శ్రీనుతో పాటు ఇద్దరు పోలీస్ సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాలకుర్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీను ను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


Comments