తులజ శ్రీ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ దేవి నవరాత్రి ఉత్సవాలు
చర్లపల్లి, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో నిర్వహించిన శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో గురువారం పాల్గొన్నారు. తులజ శ్రీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి. యువకులు నియమనిష్టలతో అమ్మవారి మాలను ధరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఆనందదాయకం” అని అభినందించారు.ఈకార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్, సీసీఎస్ కాలనీల అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ జె. సుధాకర్, సభ్యులు కిరణ్, మాదేశ్, తులజ శ్రీ యూత్ అసోసియేషన్ సభ్యులు అభి, అమూల్య, ఆశిష్, శివ, కుమార్, సాయి, వెంకటేష్, ఇతర బిఆర్ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


Comments