ఆర్టీసీ బస్సు వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి

ఆర్టీసీ బస్సు వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం రెండు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

 వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో అదే గ్రామానికి చెందిన యువకులు మృతి చెందారు.

బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం తో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డుపై గ్రామ ప్రజలు యువకులు ధర్నా నిర్వహించారు దాదాపు నాలుగు గంటల సేపు రాష్ట్ర నిర్వహించారు గ్రామస్థులు వివరాల ప్రకారం వనపర్తి డిపోకి చెందిన TS 32 T 5577 ఆర్టిసి బస్సు వనపర్తి నుండి గణపురం మీదగా మహబూబ్ నగర్ క్రమంలో పామిరెడ్డిపల్లి పల్లి గ్రామానికి చెందిన బోయ అశోక్, బోయ చందు TS 07 EF 4528 ద్విచక్ర వాహనంపై వనపర్తికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వెళుతున్న ఆర్టిసి బస్సు ద్విచక్ర వాహనం ఢీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . దీనితో గ్రామ ప్రజలు యువకులు కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా రాస్తారోక నిర్వహించారు. వెంటనే వనపర్తి డిఎస్పి కొత్తకోట సిఐ పెద్దమందడి ఎస్ఐ పోలీస్ బృందం హుటా కొట్టిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు దాదాపు నాలుగు గంటల పైన రాస్తారు ఒక నిర్వహించారు. మృతుని కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ప్రభుత్వం నుండి మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అన్ని విషయాలు తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి మృతుని కుటుంబాలకు ఆదుకుంటామని వారు అన్నారు అదేవిధంగా ఆర్టీసీ కార్పొరేషన్ నుండి. ప్రైవేటు బస్సు ఓనర్ నుండి ఆదుకుంటామన్నారు. సంఘటన స్థలానికి వనపర్తి ఆర్డిఓ పద్మావతి చేరుకున్నారు ప్రభుత్వం నుండి ఆదుకుంటామన్నారు ఆయన కూడా మృతి కుటుంబాలు గ్రామ ప్రజలు రోడ్డుపై రాస్తారోక నిర్వహించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి ఆదుకుంటామన్నారు గ్రామ నాయకులు మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి మాజీ సర్పంచ్ సిద్దయ్య శ్రీశైలం. యువకులు మృతుని కుటుంబాలలో ప్రభుత్వం నుండి మృతుని కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు..

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .