అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం అభివృద్ధి పనులు ప్రారంభించిన 

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం అభివృద్ధి పనులు ప్రారంభించిన 

కాప్రా, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్‌ బీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ.52 లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  “ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి విభాగంలో కృషి కొనసాగుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా ముఖ్య ధ్యేయం. అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాను,” అన్నారు. అనంతరం కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ — “డివిజన్ ప్రజల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తూ, అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు,” అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈ రూప, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, ఉల్లెం బాలరాజు, మల్లారెడ్డి, ఇక్బాల్, అరిఫుద్దీన్, వీరభద్రరావు, మల్లేష్ గౌడ్, బోదాసు రవి, వెంకట్, మురళి, నరసింహ గౌడ్, కృష్ణ, చంద్రశేఖర్, రామకృష్ణ, చక్రవర్తి, దాసు, కిరణ్, శేఖర్ గౌడ్, శివ, దండెం నరేందర్, నిసార్ అహ్మద్ గోరి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. డైమండ్ హిల్స్ చర్చ్ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం. వెంకటేశ్వరనగర్ మదర్ తెరిసా స్కూల్ ప్లేగ్రౌండ్ పక్కన సీసీ రోడ్డు నిర్మాణం. తిరుమలనగర్ దేవీ అపార్ట్‌మెంట్ ఎదురు రోడ్డు వద్ద సీసీ రోడ్డు నిర్మాణం.
నరసింహ నగర్ ఝాన్సీ స్కూల్ సమీపంలోని షణ్ముఖ రెసిడెన్సీ వద్ద సీసీ రోడ్డు పనులుIMG-20251006-WA0014

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .