ఉప్పల్ హిల్స్, కురుమనగర్, లక్ష్మీ నరసింహ కాలనీలకు మహార్దశ

రూ.55 లక్షలతో స్ట్రాం వాటర్ పైపు లైన్  సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో అభివృద్ధి పనులు వేగవంతం

ఉప్పల్ హిల్స్, కురుమనగర్, లక్ష్మీ నరసింహ కాలనీలకు మహార్దశ

ఉప్పల్, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ డివిజన్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కురుమనగర్, లక్ష్మీ నరసింహ కాలనీలకు అభివృద్ధి పరంగా మహార్దశ వచ్చింది. మున్సిపల్ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.55 లక్షల వ్యయంతో స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే లక్ష్మీ నరసింహ కాలనీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ – పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉప్పల్ ప్రాంతానికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని విమర్శించారు. నాడు మల్కాజ్గిరి ఎంపీగా, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని ఆమె తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కృషితో ప్రభుత్వం నుండి భారీగా నిధులు మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు.“ఉప్పల్ డివిజన్‌లో ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీలు, పైపులైన్‌లు, చెరువుల అభివృద్ధి వంటి పలు పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే మా ప్రధాన ధ్యేయం” అని రజితా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఉప్పల్ హిల్స్‌లో రూ.55 లక్షలతో స్ట్రాం వాటర్ పైపు లైన్ పనులను, లక్ష్మీ నరసింహ కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ అభివృద్ధి పనులను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు.
అలాగే ఉప్పల్‌లో రూ.27 కోట్లతో నల్లచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఈ వెన్నెల గౌడ్, ఏఈ రాజ్ కుమార్, నాయకులు దుర్గం నవీన్ యాదవ్, బాజా అబ్బయ్య, గోవింద్, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, సల్లా ప్రభాకర్ రెడ్డి, పి. రామచందర్, మంగ సుధాకర్ యాదవ్, టి. శ్రీనివాస్ రెడ్డి, అక్కు రవి, కుమార్ స్వామి, మహేందర్, సంజయ్, హుస్సేన్, ఎన్. కిట్టు, శేఖర్, రాములు, నర్సింహ గౌడ్, ఊషయ్య, రాజు చారి, అయిలయ్య, బాబూరావు, శ్రీనివాస్, సైధులు, కృష్ణ, రాజ్ కుమార్, చట్టి, రామకృష్ణ, రమేష్, సోమేష్, గుర్రం రమేష్, నరేందర్, ఎం.డి. హర్షద్, మాజిద్, రవీందర్, కొమురయ్య, కె.కుమార్, హరీష్, దయాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .