వాటర్ వర్క్స్ ఎండీని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

రామంతపూర్ డివిజన్ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధుల మంజూరు

వాటర్ వర్క్స్ ఎండీని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్, అక్టోబర్‌ 6 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డిను జలమండలి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్‌రావు కూడా పాల్గొన్నారు. రామంతపూర్ ప్రాంతంలో వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులపై చర్చించి, రూ. 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులుమంజూరు చేయించడంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలకపాత్ర వహించారు.ఈ నిధులతో వివేక్ నగర్ నుండి తూర్పు శ్రీనివాసపురం ప్రధాన రహదారి వరకు, అలాగే తూర్పుశ్రీనివాసపురం మరియు మధుర నగర్ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల డయా స్విగ్ సబ్లైన్‌లను 450 మిల్లీమీటర్ల డయా ఆర్‌సిసి మురుగు మెయిన్ లైన్‌తో కలిపే పనులు చేపట్టనున్నారు. ఈ పనులు హబ్సిగుడా వార్డు నంబర్ 8 పరిధిలో జరుగనున్నాయి.అదనంగా రామంతపూర్ సెక్షన్ సబ్ డివిజన్ – ఎలుగుట్ట ఓ & ఎం డివిజన్ నంబర్ 14 పరిధిలోని రవీందర్ రెడ్డి నగర్ వంటి పలు ప్రదేశాల్లో 100 మిల్లీ మీటర్ల లైన్ కింద 200 మిల్లీమీటర్ల స్విగ్ మురుగు లైన్ పనులు కూడా మంజూరయ్యాయి.ఈ సందర్భంగా గంధం నాగేశ్వర్‌ రావుమాట్లాడుతూ,
రామంతపూర్ ప్రాంత అభివృద్ధికి 2.50 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు,అన్నారు.
ప్రధాన అంశాలు:రామంతపూర్ డివిజన్ అభివృద్ధికి రూ. 2.50 కోట్లు హబ్సిగుడా వార్డ్ 8 పరిధిలో ఆర్‌సిసి మురుగు మెయిన్ లైన్ పనులు,రవీందర్ రెడ్డి నగర్‌లో 200 మి.మీ. స్విగ్ మురుగు లైన్ మంజూరు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .