యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకోం 

విద్యార్థి సంఘాల హెచ్చరిక

యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకోం 

హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు:

కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మతో శవయాత్ర ర్యాలీ నిర్వహించి, పరిపాలన భవనం ముందు దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ,బిఆర్ఎస్వి,ఏఐఎఫ్డిఎస్, 
పిడిఎస్యూ,ఎస్ఎస్యూ,డీఎస్ఏ,ఏఐడిఎస్ఒ వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం నుండి పరిపాలన భవనం వరకు దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్, బిఆర్ఎస్వి కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, పీడీఎస్‌యు జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, డీఎస్సీఎ రాష్ట్ర కన్వీనర్ శ్రావణ్ కుమార్, ఎస్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్, ఎఐడిఎస్‌ఓ నాయకుడు రాజేష్ తదితరులు మాట్లాడుతూ—

“యూనివర్సిటీకి చెందిన 15 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఏకపక్షంగా ఆమోదం తెలపడం తగదు. ఎవరి అనుమతి లేకుండానే తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. గతంలో యూనివర్సిటీ భూములను కొందరు కబ్జా చేసినా చర్యలు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్ పక్కనే సీఆర్పీఎఫ్ విభాగం దాదాపు 10 ఎకరాలు ఆక్రమించుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు కొత్తగా భూములను కేటాయించాలనుకోవడం విద్యార్థుల అభ్యంతరానికి గురవుతోంది.”

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించాలని, యూనివర్సిటీ భూములపై ప్రభుత్వ ముద్ర పడేలా చేయబోమని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను యూనివర్సిటీ వెలుపల నిర్మించాలనే డిమాండ్‌ చేశారు.స్థానిక ఎమ్మెల్యే, వైస్‌ చాన్స్‌లర్, పాలకమండలి సభ్యులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేస్తూ, ఇది కొనసాగితే యూనివర్సిటీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.WhatsApp Image 2025-07-04 at 10.25.45 PM (1)
ఈ నిరసనలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, ఎస్ఎఫ్ఐ కేయూ అధ్యక్ష కార్యదర్శులు చెన్నూరి సాయికుమార్, బిరెడ్డి జస్వంత్, అలాగే గణేష్, సావిత్రి, పవన్ కుమార్, సందీప్, అజయ్, ప్రదీప్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .